సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వండి : స్వాతి

ప్రజాశక్తి – ముదినేపల్లి

పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న సంక్షేమ ప్రభుత్వానికి మరోమారు మద్దతివ్వాలని కైకలూరు ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ కోడలు దూలం స్వాతి అన్నారు. బుధవారం మండలంలోని బొమ్మినంపాడులో వైసిపి శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసిపి ఎంఎల్‌ఎ, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, గంటా సంధ్య, వైస్‌ ఎంపిపిలు సిహెచ్‌.సునీత, రాచూరి రాధా, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శీలం రామకృష్ణ, లేళ్ల ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️