పరిపాలనా విభాగాల పరిశీలన

May 18,2024 23:35 #AU, #Registrar
AU, Registrar

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో పలు విభాగాలను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌ శనివారం పరిశీలించారు. పరిపాలనా విభాగంలో సేవలందిస్తున్న ప్రతి విభాగాన్నీ ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యాలయాలు ఆధునీకరణ, అవసరమైన మార్పులు, మరమ్మత్తులు చేపట్టడం తదితర అంశాలపై సిబ్బంది సూచనలు, ఆలోచనలు తీసుకున్నారు. ప్రతి విభాగాన్నీ పూర్తిస్థాయిలో ఆధునీకరించడం, విద్యార్థులకు, ఉద్యోగులకు మరింత సమర్థ సేవలు అందించడం లక్ష్యంగా ఆలోచన చేయాలని సూచించారు. రిజిస్ట్రార్‌ వెంట డి.ఆర్‌ సాంబమూర్తి, ఎఆర్‌ గంట గోపాలకృష్ణ, పలువురు సూపరింటెండెంట్‌లు ఉన్నారు.

➡️