ఉత్సాహంగా కళాకృతుల తయారీ

May 21,2024 23:29 #mlkp, #summer camps
mlkp, summer, camp

 ప్రజాశక్తి -ములగాడ : వ్యర్థ పదార్థాల నుంచి విలువైన వస్తువులను తయారుచేసే కళాకృతుల వర్క్‌షాపును మంగళవారం మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఏర్పాటుచేసిన ఈ వర్క్‌షాప్‌నకు జాతీయ సేవా పథకం సీనియర్‌ ప్రోగ్రామ్‌ అధికారి వై.అనసూయాదేవి రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించి కాగితాలతో, వివిధ రకాల వ్యర్ధ పదార్థాలతో కళాకృతులను తయారు చేయడంలో బాలలకు శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల పువ్వులను, బొకేలను, అలంకరణ వస్తువులను బాలలు తయారు చేశారు. ఇటువంటి చేతివృత్తులలో శిక్షణ ఇవ్వడం వల్ల బాలల్లో ఆసక్తి కనబడుతుందని, నైపుణ్యాలు పెరుగుతాయని, పరిశీలన శక్తి, సృజనాత్మకశక్తి బయటకు వస్తాయని రిసోర్స్‌ పర్సన్‌ అనసూయాదేవి తెలిపారు. అనంతరం బాలలంతా తయారు చేసిన వివిధ వస్తువులను, కళాకృతులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి, గ్రంథాలయాధికారి వి.అజరుకుమార్‌ సారథ్యం వహించారు. కార్యక్రమం అనంతరం బాలలంతా దేశభక్తి గేయాలను ఆలపించారు. అంతకుముందు ఫార్మసీ విద్యార్థి జాన్‌ ఆధ్వర్యాన బాలలకు సైన్స్‌ ప్రయోగాలపై శిక్షణ ఇచ్చారు.

➡️