సిటియులో పిజి ఎడ్మిషన్ల గడువు పొడిగింపు

May 22,2024 19:57

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వివిధ పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేదీ రాత్రి 11:55గంటల వరకు పొడిగిస్తున్నట్లు వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎన్‌టిఎ నిర్వహించిన సియుఇటి (పీజీ) పరీక్ష రాసిన వారు పీజీ ప్రోగ్రామ్‌లకు షషష.ష్‌బaజూ.aష.ఱఅ గాని, లేదా ష్ట్ర్‌్‌జూర://ష్‌బaజూషబవ్‌.ఝఎaత్‌ీష్ట్ర.వసబ.ఱఅ/జూస్త్ర ద్వారా తమ పేరును ఈనెల 26కు లోపు రిజిస్టర్‌ చేసుకోవాలని విసి కట్టిమని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ క్యాంపస్‌ లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ డెస్క్‌ను లేదా, 6300443499 మొబైలు నెంబర్‌ ను గాని యూనివర్సిటీ పని వేళలలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

➡️