విద్యుదాఘాతానికి రైతు బలి

Apr 20,2024 21:09

వ్యవసాయ బోరు బోర్డు వైరు తగిలి మృతి

అంపిలి గ్రామంలో విషాదం

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని సంకిలి పంచాయతీ పరిధి బొడ్డవలస గ్రామ సమీప పొలంలో శనివారం విద్యుత్‌ షాక్‌తో పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన రైతు వావిలపల్లి అప్పలనాయుడు (58) అక్కడకక్కడే మృతి చెందారు. తన వ్యవసాయ భూములలో పంటలు ఎండిపోతున్నాయని, మోటార్‌ బోరు వేయటానికి వేకువజామున తన కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. షెడ్‌లోకి వెళ్లి బోర్డు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా అక్కడ వేలాడి ఉన్న విద్యుత్తు తీగను తాకడంతో షాక్‌ కొట్టింది. అటుగా వెళ్లిన తోటి రైతులు ఎప్పటికీ నీరు రాలేదని గ్రహించి మోటార్‌ షెడ్‌ వద్దకు చేరుకుని చూసే సరికి అప్పలనాయుడు మృతి చెంది ఉన్నాడు. వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రేగిడి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించగా ఎఎస్‌ఐ రాజారావు, తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అప్పలనాయుడు మృత దేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ రాజారావు తెలిపారు.అంపిలిలో విషాదఛాయలురైతు అప్పలనాయుడు మృతి చెందడంతో అంపిలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలం కెళ్ళి వస్తానని ఇంటి వద్ద చెప్పి ఇలా మృత్యువాత పడడం పలువురిని కంట తడి పెట్టించింది.

➡️