ఫెర్టిలైజర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం

Dec 9,2023 14:48 #Anantapuram District
fire accident in fertilizer shop

పొగతో నిండిన గూగూడు రోడ్డు

ప్రజాశక్త-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గూగూడు రోడ్డులోని నాగభూషణం ఫర్టిలైజర్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా తీవ్రంగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని క్రిమిసంహారక మందులు అంటుకోవడంతో గూగూడు రోడ్డు మొత్తం పొగతో కూడిన దుర్వాసనతో నిండిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు దుకాణ నిర్వాహకుడు నాగభూషణం సమాచారం అందజేశారు. అప్పటికే దుకాణంలోని ఉన్నటువంటి సరుకు మొత్తం కాలిపోయింది. హుటాహుటిన స్థానికులు దుకాణ నిర్వాహకులు పోలీసులు నీటి టాంకర్ ని తెప్పించి మంటలు అదుపులోకి తెచ్చేలోపే దుకాణంలోని సరుకు మొత్తం కాలిపోయింది. దీంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఈ దుకాణం నిర్వాహకులు నాగభూషణం తెలిపారు గతంలో కూడా గూగూడు రోడ్డులో ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ తో తీవ్రమైన మంటలు వ్యాపించి లక్షలాది రూపాయలు విలువచేసే వస్తువులు కాలిపోయాయి.

➡️