నార్పలలో ఉచిత వైద్య శిబిరం

Mar 2,2024 12:56 #Free medical camp, #Narpala

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : కర్నూలు ఏఏ హాస్పిటల్స్‌, కొనంకి సోదరుల ఆధ్వర్యంలో శనివారం నార్పల లోని స్థానిక తిక్కయ్య స్వామి గుడి ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వైసీపీ సీనియర్‌ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిపుణులైన డాక్టర్స్‌ తో ఉచితంగా నిర్వహిస్తారని ఏ ఏ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ కొనంకి అజిత్‌ కుమార్‌ చౌదరి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో దగ్గు, జలుబు, జ్వరము ,బీపీ ,షుగర్‌, థైరాయిడ్‌, మొలలు ఫిస్టులా ఆపెండైటిస్‌ ,హెర్నియా కండరాలలో వాపు ,వరిబీజం వాపు, సంతానలేమి సమస్యలు, గర్భసంచి ఆపరేషన్లు ,ఎముకలు విరిగిన ఎముకల సాంద్రత, ఊపిరితిత్తుల, గుండె సమస్యలు, కిడ్నీ మరియు నరాల బలహీనతలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సొంత మండల ప్రజల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి అన్నారు వివిధ వైద్య పరీక్షల కోసం వైద్య శిబిరానికి వచ్చినవారికి కొనంకి సోదరులు రంగయ్య సుధాకర్‌ లు దగ్గరుండి సహాయ సహకారాలు అందించారు. వైద్యులకు వైద్య పరీక్షలకు వచ్చినవారికి ఆలయావరణంలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాన్నిల సుప్రియ, ఉప సర్పంచ్‌ శ్రీరాములు ఎంపీటీసీలు కాటమయ్య, పద్మాకర్‌ రెడ్డి, వైసీపీ నాయకులు పప్పూరు నరసింహులు భాస్కర్‌ రెడ్డి మైనార్టీ నాయకులు ఖాదర్‌ వలి, అమీర్‌ భాష, జీలన్‌ భాష, రామకఅష్ణ, రమేష్‌ గోపాల్‌, నాగభూషణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️