పేదల జీవితంలో వెలుగులు నింపేందుకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు : డాక్టర్ ఉగ్ర

Feb 18,2024 16:32 #eye camp, #ongle district

ప్రజాశక్తి -కనిగిరి( ప్రకాశం) : పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్గ్ ముక్కు నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో ఆదివారం జనని చారిటబుల్ ట్రస్ట్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, గుంటూరు శంకర నేత్రాలయం సహకారంతో డాక్టర్ ఉగ్ర ఆధ్వర్యంలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించగా విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కాజల్, శ్యామ్ దీప్ లు కంటి 236 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 173 మందిని కంటి ఆపరేషన్ల కు ఎంపిక చేశారు.ఆపరేషన్ కు ఎంపికైన వారికీ ఉగ్రనరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో తరలింపు చర్యలు చేపట్టారు.  మొదటి విడతగా 50 మందిని పంపించారు. 2వ విడతగా 19న 60 మంది,3వ విడతగా 20న 50 మంది తరలించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా పేదల సంక్షేమం కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వాలంటీర్లుగా ఐటీడీపి కో ఆర్డినేటర్లు షేక్ జంషీర్ అహ్మద్, మారనేని రామ కృష్ణ, నాగరాజు, జింకా మధు, కాశీ, దసరధ, రాము, రోశయ్య, ఖాజా, రెహమాన్, వెంకటరెడ్డి, దస్తగిరి, ఖాసీం, కొండలు టీడీపీ శ్రేణులు వ్యవహరించారు.

➡️