ఓటుతోనే రాక్షస పాలన నుంచి విముక్తి

Apr 29,2024 21:18

ప్రజాశక్తి- చీపురుపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన నుంచి విముక్తులవ్వాలంటే సైకిల్‌ గుర్తుకి ఓటెయ్యాలని టిడిపి పొలిట్‌ బ్యురో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం మండలంలోని దేవరపొదిలాం, చొక్కరపాలేం గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న మహిళలను కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు.గిరిశిఖర ప్రాంత సమస్యలకు ప్రాధాన్యత రామభద్రపురం: గిరిశిఖర ప్రాంత సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తానని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన హామీఇచ్చారు. మండలంలోని ఎనుబరువు, ఆర్‌.చింతలవలస గిరిజన గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి నాయుడు, కర్రోతు తిరుపతిరావు, కనిమెరక శంకరరావు, గ్రామ నాయకులు బోయిన లూర్దమ్మ తదితరులు పాల్గొన్నారు.కోండ్రుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం వంగర: రాజాం నియోజకవర్గ టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌కు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మాజీ జెడ్‌పిటిసి బొత్స వాసుదేరావునాయుడు మండలంలోని కొప్పర వలసలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పిన్నింటి మోహనరావు, యలకల దుర్గబాబు పాల్గొన్నారు.ప్రజలను నిండా ముంచిన జగన్‌ గజపతినగరం : మండలంలోని కెంగువ, రంగుపురం, కొత్తవలస, ముచ్చర్ల గ్రామాల్లో టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు అట్టాడ లక్ష్మణ్‌నాయుడు, శ్రీదేవి, మక్కువ శ్రీధర్‌ పాల్గొన్నారు. వేపాడ: మండలంలోని సోంపురం, అరిగిపాలెం, ఆతవ గ్రామాల్లో సోమవారం రాత్రి టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, టిడిప రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారిని, ఎమ్‌పి అభ్యర్థిగా ఎం. శ్రీభరత్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు టిడిపి నాయకులు బైరవనేని శ్రీనాగి దాసరి లక్ష్మి, పి. రమణ, రమణమూర్తి, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.గ్రామాల్లో టిడిపి ఇంటింటి ప్రచారం వేపాడ: మండలంలోని బల్లంకి, బానాది గ్రామాల్లో టిడిపి మహిళా నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారిని, ఎమ్‌పిగా శ్రీభరత్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అవేర్నెస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గొంప తులసి, లలిత కుమారి చెల్లెలు రాధిక నాయుడు, బల్లంకి, బానాది టిడిపి మహిళా సభ్యులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. సీతానగరం : మండలంలోని కామన్నదొరవలస, పాపమ్మవలస, గుచ్చిమి గ్రామాల్లో మండల టిడిపి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యంనాయుడు, వేణుగోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. కార్యక్రమంలో క్లష్టర్‌ ఇంచార్జీ లక్ష్మణరావు, బుడితి గోపాలకృష్ణ, మరడాన గౌరు నాయుడు, బూరడ చిరింజీవి, మరిశర్ల సంజీవినాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జియ్యమ్మవలస : కురుపాం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తోయక జగదీశ్వరిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్ర దేవ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని బిత్తరపాడు, నిమ్మలపాడు, బట్ల భద్ర, సీమనాయుడు వలస, బాసంగి, పెదమేరంగిలో నాయకులు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగదీశ్వరికి సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరంతా వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏళ్ల తరబడి ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పాచిపెంట: మండలంలోని పనుకువలస పంచాయతీ కందిరివలస, గుంట మామిడి వలస, కోస్ట్‌ వలస, చిన్న చీపురువలస, పెద్ద చీపురువలస, పాచిపెంట పంచాయతీ గడివలస, కూనంబందవలస, గార్లవలస, కర్రివలస పంచాయతీ ఇటికిలు వలస, చాకిరాయి వలస తదితర గ్రామాల్లో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ఆమె ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్‌, మండల టిడిపి నాయకులు పిన్నింటి ప్రసాద్‌ బాబు, నాయకులు ముఖీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పలువురు టిడిపిలో చేరికమక్కువ: మండలంలోని వైసిపికి చెందిన చెముడు ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ, కొయ్యన్నపేట పంచాయతీ మాజీ సర్పంచ్‌ కొయ్యన కాశీ విశ్వనాథం తమ అనుచరులతో సోమవారం టిడిపిలో చేరారు. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జి.వేణుగోపాలనాయుడు, సీనియర్‌ నాయకులు ఎం.ప్రసాదరావు నాయుడు, బొంగు వాసుదేవరావు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

➡️