అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వండి : ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆమరణ నిరాహారదీక్ష

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక జగనన్న కాలనీలో అర్హులైన ఇళ్ళు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … రెవెన్యూ అధికారులు గ్రామంలో రెండు, మూడు ఇండ్లు ఉన్నవారికే స్థలాలు కేటాయించారని అన్నారు. రెవెన్యూ అధికారులు జగనన్న కాలనీలో అక్రమాలు గుర్తించాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు పుల్లప్ప, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️