వార్డుల్లో గొట్టిపాటి లక్ష్మి పర్యటన

ప్రజాశక్తి-దర్శి : దర్శి నగర పంచాయతీ లోని 16, 12 వార్డుల్లో టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొట్టిశ్రీరాములు వీధి, గొర్లగడ్డ, పుట్ట బజారు, కోత మిషన్‌ బజార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాల అభివద్ధి చెందుతుందన్నారు. పేదలు, మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాలను తెచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొనకొండ మండలం మంగినపూడికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, నాయకులు నారపుశెట్టి మధు, జూపల్లి కోటేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, ఐటిడిపి ఉపాధ్యక్షుడు రామయ్య, బిజెపి నాయకులు తిండి నారాయణరెడ్డి, మండపాకల శ్రీనివాసరావు, జనసేన నాయకులు పాపారావు, కొండయ్య, చిరంజీవి, టిడిపి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

➡️