ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ప్రజాశక్తి -భీమునిపట్నం : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఐదింటిని నెరవేరుస్తూ సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ నూకరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నూకరాజు మాట్లాడుతూ, మెగా డిఎస్‌సి, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, సామాజిక పింఛన్లు సాయం పెంపు, అన్నాక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. టిడిపి మూడో వార్డు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్రకుమార్‌, నాయకులు గాడు సన్యాసినాయుడు, కె నాగరాజు, ఎం సంజీవ్‌కుమార్‌, బిజెపి నియోజకవర్గ ఇంఛార్జి కె రామానాయుడు పాల్గొన్నారు

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కూటమి నేతలు, కార్యకర్తలు

➡️