పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలి

Dec 9,2023 16:20 #Anantapuram District
govt schemes reached public

నగర మేయర్ మహమ్మద్ వసీం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.నగరంలోని కృష్ణ కళా మందిరం లో శనివారం నిర్వహించిన వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్ విజయ భాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి ,ఐసిడిఎస్ పిడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో వికసిత్ భారత్‌ సంకల్ప యాత్రను చేపట్టారన్నారు. సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల అర్హులకు ఆయా పథకాలు చేరువ అయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించి అనంతరం పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఉజ్వల భారత్ కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రమణారెడ్డి, నగరపాలక కార్యదర్శి సంఘం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

➡️