గుంటూరు తూర్పునకు 4, పశ్చిమకు 2 నామినేషన్లు

Apr 20,2024 00:32

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పుని యోజకవర్గానికి రెండోరోజైన శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిఎంసి ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరికి నామినేషన్‌ పత్రాలు అందచేశారు. వైసిపి తరపు నూరి ఫాతిమా నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళదాస్‌ నగర్‌ నుండి ర్యాలీగా ఆర్‌ఒ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ముస్తఫా తదితరులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. నూరి ఫాతిమా తల్లి దూరే షహవార్‌ షేక్‌ వైసిపి తరపున ఒకసెట్‌, మరోసెట్‌ ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. నవరత్నం పార్టీ అభ్యర్థి షేక్‌.రజాక్‌, బహుజన సమాజ్‌ పార్టీ తరపున గూడవల్లి మణికుమారి నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు వెస్ట్‌కు రెండు నామినేషన్లు..గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బిఎస్‌పి నుండి సిహెచ్‌.శ్రీనివాసరావు, టిడిపి అభ్యర్థి గల్లా మాధవి తరపున కోరిటపాటి హృదయరాజు నామినేషన్‌ వేశారు. వారి నామినేషన్లను నియోజకవర్గ ఆర్‌ఒ కె.రాజ్యలక్ష్మికి అందచేశారు.

➡️