ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు

Apr 11,2024 13:37 #Guntur District

ప్రజాశక్తిమంగళగిరి : ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినాలు. దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేది రంజాన్ మాసం. అల్లా దయతో ఈ ఏడాది రాష్ట్ర ప్రజానీకానికి కష్టాల నుంచి విముక్తి కలగాలని లోకేష్ ఆకాంక్షించారు.

➡️