ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టాలని ధర్నా

Mar 11,2024 11:39 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి : ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గౌతమ్ బుద్ధ రోడ్డు వద్ద గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది అని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల బాండ్ల విషయంలో బిజెపి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. సుప్రీం కోర్ట్ వారం రోజుల్లో అమలు చేయాలని చెప్పినప్పటికీ ఇంతవరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎస్ గణేష్, టి శ్రీరాములు, వివిధ సంఘాల నాయకులు డి రామారావు, షేక్ జానీ భాష, బి స్వామినాథ్, జె వెంకటేష్, ఎస్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

➡️