తాళాలు పగుల కొట్టడం అన్యాయం

Dec 20,2023 15:25 #Guntur District
gnt anganwadi workers strike on 9th day

ప్రజాశక్తి-చిలకలూరిపేట : అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు (సిఐటియు) యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడల చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి ఎనిమిదోవ రోజుకి చేరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక పండరీ పురంలో రెండవ లైన్ లో గల సిఐటియు కార్యాలయం నుంచి ఎన్ ఆర్ టి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వంట వార్పు కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షులు జి. సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షురాలు జి. సా విత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరం కుశ ధోరణి విడి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వా డీల సమస్యల పరిష్కారం కోసం కృషి చే యాలన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ పెరుబోయిన వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతం ఇస్తానని మాట తప్పరన్నా రు. సచివాలయ ఉద్యోగస్తులు కార్యదర్శులు తదితరుల ద్వారా అంగన్వాడీ కేంద్రంల తాళాలు పగుల కొట్టడం అన్యాయమని.. ఈ తాళాలు పగుల గొట్టిన వారిని వెంటనే అరెస్టులు చేయాలన్నారు. అంటే కాకుండా ఈ అంగన్వాడీలను చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని లేకుం టే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సెక్టార్లు లీడర్లు ఏ.పద్మ., పార్వతి., అంగన్వాడీలు, హెల్పర్లు, ఆయాలు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక నాయకులు తీయగూర ప్రతాపరెడ్డి, వ్యవసాయ కార్మిక సం ఘం డివిజన్ అధ్యక్షులు సాతులూరి లూథర్, చిలకలూరిపేట పట్టణ రిక్షా వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు బి. కోటా నాయక్,ఐద్వా పట్టణ కార్యదర్శి పి.భారతి., ఏఐటీయూసీ నాయకులు ఏలూరు రామారావు,అఖిల భారత మహిళా సమాఖ్య కార్యదర్శి చేరుకుపల్లి విజయ నిర్మల తదితరులు పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

➡️