పరం జ్యోతి ఆశయాలు కొనసాగిద్దాం

Dec 1,2023 16:52 #Konaseema
gurrala paramjyothi 18th death anniversary

ద్రాక్షారామంలో వర్ధంతి సభ

ప్రజాశక్తి-రామచంద్రపురం : దేశంలో భూమి, భుక్తి, విముక్తి సాధనతోనే సమసమాజ స్థాపన అని నమ్మి తుది శ్వాస వరకు విప్లవ పంథాలోనే పయనించిన విప్లవకారుడు కామ్రేడ్ గుర్రాల పరం జ్యోతి ఆశయాలు కొనసాగిద్దామని సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు అన్నారు. కామ్రేడ్ పరం జ్యోతి 18వ వర్ధంతి ద్రాక్షారామ వీరేశుగుళ్లు కాలనీలో నిర్వహించారు. పరం జ్యోతి స్తూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో “నేడు దేశంలో, రాష్ట్రంలో ప్రజలు కులం పేరా, మతం పేరావిభజించబడుతూ తీవ్ర అభద్రతల మధ్యబతుకుతున్నారనీ, మోడీ ప్రభుత్వం హిందూమతోన్మాదంతో ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు పెడుతూ యావత్తు దేశాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు తెగనమ్ముతుందని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని హిందూ మతాతత్వ భావజాలానికి అనుకూలంగా మర్చివేస్తూ దేశంలో మెజార్టీ ప్రజానీకాన్ని అణచివేస్తుందని అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మోడీ తో కమ్మకై తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పౌర, ప్రజాస్వామిక హక్కులను కాల రాచివేస్తున్నదనీ ఒక వైపు జనాకర్షక పథకాలు ద్వారా ప్రజానీకాన్ని మభ్యపెడుతూ రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాల గొంతునునులిమివేస్తున్నదనీ విమర్శించారు. రాష్ట్రన్నీ మోడీకి తాకట్టు పెట్టి ఆర్ధికంగా, సామాజికంగా పతనం చేస్తూ అవినీతిని పెంచి పోషించిస్తున్నది.బలహీన వర్గాలకు, షెడ్యూల్ కులాల మైనార్టీలకు భద్రత శూన్యం. ఏ ప్రభుత్వం వచ్చిన దున్నే వాడికే భూమి రాకుండా వ్యవస్థలో ఇంచుకుండా మార్పురాదని వివరించారు. ఏ ఐ కె ఏం ఎస్ జిల్లా నాయకులు వి. భీమా శంకర్ మాట్లాడుతూ ప్రజలు విప్లవ పోరాటాలు ద్వారానే సమాజాన్ని మార్చుకోవాలని. దోపిడీ, పాలక వర్గాల పధకాల ఉచ్చులో పడకూడదని అన్నారు. జగన్ పాలన లో రాష్ట్రం ధ్వంసం అయిన రోడ్డులకి, దళితులు పై దాడులకు, నిరుద్యోగానికి ,అవినీతి కి అడ్రస్ గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బి. సిద్దూ మాట్లాడుతూ కామ్రేడ్ పరం జ్యోతి స్పూర్తితో దళితులు, ఆదివాసీ హక్కులు కోసం పోరాటం చేయాలని, జగన్, మోడీ ప్రభుత్వాలు విద్య రంగంలో అనేక మార్పులు చేస్తున్నాయని. ప్రభుత్వ రంగంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేద వర్గాల విద్యార్ధులు కు ఇచ్చే సంక్షేమ పథకాలు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ రద్దు చేసారని వివరించారు. ఈ కార్యక్రమంలో పీ. వై ఎల్ జిల్లా నాయకులు అంబటి కృష్ణ, కామ్రేడ్ గుర్రాల పరం జ్యోతి సతీమణి దయమణి, వెంకటాయపాలెం సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారి, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ రాంబాబు, ద్రాక్షారామ దళిత ఐక్య వేదిక నాయకులు వెంటపల్లి రామకృష్ణ, గుబ్బల శ్రీను, రేవు నాగేశ్వరరావు, వెంకటాయపాలెం శిరోముండ నం భాదితులు కె.చిన్న రాజు, సిహెచ్ పట్టాభి, ఏ ఐ కె ఎం ఎస్ నాయకులు చింతా రాజారెడ్డి, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గంగవరం పనసయ్య, రావి భాను,రిక్షా ప్రెసిడెంట్ పి. చంద్ర రావు,కోటిపల్లి కోట జె. ప్రసాద్, సి.హెచ్ ధనలక్ష్మి, పి. ఒ .డబ్యు ఎన్. భవాని,చిర్రా మార్తమ్మ, టి. లక్ష్మణ్ , కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

➡️