‘గురుదేవ్‌’ సేవలు వెలకట్టలేనివి

Jun 20,2024 21:24

 ప్రజాశక్తి-కొత్తవలస  : వికలాంగులకు గురుదేవ్‌ చాటిబుల్‌ ట్రస్ట్‌ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొత్తవలస సిఐ బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం మంగళపాలెం వద్దనున్న శ్రీగురుదేవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుమారు వెయ్యి మంది వికలాంగులతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రస్ట్‌ ద్వారా ఇటువంటి సేవలు అందించడం అభినందనీ యమని కొనియాడారు. అనంతరం వికలాంగు లకు టీషర్టులు, టోపీలు పంపిణీ చేశారు. అంధులకు పింఛన్లు, వృద్ధులకు రేషన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ప్రసాద్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ రాపర్తి జగదీశ్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వి.ఫణింద్ర, సభ్యులు పాల్గొన్నారు.

➡️