సజ్జలను కలిసిన సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు

Nov 24,2023 16:29 #Kurnool

ప్రజాశక్తి-తుగ్గలి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ ఆర్ హనుమంతు, టైలర్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో వారు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో వివరించడం జరిగిందని, పత్తికొండ శాసనసభ్యులు శ్రీదేవి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని వారు సజ్జలకు తెలియజేశారు. సచివాలయ మండలగ్రామ కన్వీనర్లకు, గృహ సారథులకు మరింత భారం పెరిగిందని ఆయనకు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలే మరల జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటారని అయన తెలియ జేశారు. ఆయన వెంట సచివాలయ కన్వీనర్ లంకాయ పల్లి హనుమంతు రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️