తుళ్లూరులో భారీ వర్షం

 తుళ్లూరు: తుళ్లూరు పరిసర గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు గం టకు పైగా ఉరు ములు, మెరుపులతో వర్షం కురిసింది. వర్షంతో పాటు బల మైన గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు విరిగిపడడం, ఇళ్లపై నున్న రేకులు ఎగిరిపోవడం జరిగింది. కొన్ని చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వర్షం కార ణంగా పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పెదపరిమిలో ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహించింది.డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవ డంతో నీరు రోడ్ల పైకి చేరు తోందని గ్రామానికి చెందిన సరిపూడి సాంబశివరావు చెప్పారు. వర్షం తగ్గాక విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

➡️