సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ సైనికుల్లా పనిచేయాలని వైసీపీ పమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ సోదరుడు సుధాకర్‌ పిలుపునిచ్చారు. సోమవారం యర్రగొండపాలెం పట్టణంలోని పలు వీధుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్‌ సోదరుడు సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే ఆచరణ కాని హామీలను పట్టించుకోకుండా వైసీపీకి, సీఎం జగనన్నకు అందరూ సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్‌ను, ఎంపిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌ భార్య తాటిపర్తి భాగ్యసీమ చౌదరి, కుమార్తె తాటిపర్తి ఆకాంక్ష, శింగరాయకొండ సర్పంచ్‌ తాటిపర్తి వనజ, ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, సర్పంచ్‌ రామావత్‌ అరుణాబాయి, మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, నాయకులు నర్రెడ్డి వెంకటరెడ్డి, సూరె వెంకట రమేష్‌, ఎలిశల కోటేశ్వరరావు, ఎజ్రా, కందూరి గురుప్రసాద్‌, జబివుల్లా, ఆంజనేయులు, ఇర్ఫాన్‌, సూరె వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️