కొత్తగణేశునిపాడులో భయానకం

May 14,2024 01:45

కొత్తగణేశునిపాడులో ధ్వంసమైన వాహనాలు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
మాచవరం మండంలంలోని కొత్తగణేశునిపాడులో ఎన్నికల వివాదాలు దారుణరూపం దాల్చాయి. సోమవారం రాత్రి పెత్తందారీ సామాజిక తరగతికి చెందిన కొందరు గ్రామంలో యాదవ, రజక సామాజిక తరగతులకు చెందిన ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడులకు తెగబట్టారు. కనిపించిన వారిని కనిపించినట్లు చితకబాదారు. ఈ భయానక వాతావరణంతో భీతిల్లిన కొందరు పొలాల దారిలో పరారయ్యారు. దీంతో ఆ ప్రాంతంలోని ద్విచక్రవాహనాలు, ఆటోలు, జెసిబిని దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు సైతం ఆ ప్రాంతంలోకి వెళ్ళకపోవడంతో మహిళలు, వృద్ధులు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. సుమారుగా 100-150 మందికి పైగా గ్రామంలో తిరుగుతూ దాడులకు తెగబడ్డారు.

➡️