ఉగ్గినిపాలెంలో కొత్త మోటారు ఏర్పాటు

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలో ఉగ్గినిపాలెం గ్రామంలో నూతన రక్షిత మంచినీటి మోటార్‌ ను బుధవారం గ్రామ సర్పంచ్‌ కలగ గున్నయ్యనాయడు వేయించారు. గ్రామాలలో మంచి నీటి సమస్య తలెత్తకుండా ముందుగా మంచినీళ్లు అందించాలని మోటార్‌ వేయించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు వీధి దీపాలు పోయిన స్తంభాల వద్ద లైట్లు వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

➡️