వైసిపితోనే ప్రజలకు మేలు : శంబంగి

Apr 22,2024 22:31

 ప్రజాశక్తి-బొబ్బిలి : వైసిపితోనే ప్రజలందరికీ మేలు జరుగుతోందని ఆ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. సోమవారం పట్టణ పరిధిలోని 22వ వార్డు, పొలవానివాలస, ఐటిఐ కాలనీ, జగనన్న కాలనీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసిపి ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదరికాన్నే కొలమానంగా తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. ఎవరి పాలన మేలు చేస్తుందో ప్రజలు గుర్తించాలని కోరారు.

➡️