జనాలను మోసం చేసిన జగన్‌

Apr 20,2024 20:45

జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ హైపర్‌ ఆది

ప్రజాశక్తి – భోగాపురం :  మాట తప్పను..మడమ తిప్పనని చెప్పి జనాలను జగన్‌ మోహన్‌ రెడ్డి మోసం చేశారని జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ హైపర్‌ ఆది అన్నారు. మండలంలోని రావాడ గ్రామంలో జనసేన అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మద్యపాన నిషేధం, పెన్షన్ల విషయంలో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇంట్లో ఉన్న చెల్లెకు మంచి చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటాడని అన్నారు. 21 సీట్లను తీసుకొని ఏం చేస్తాడని పవన్‌ కళ్యాణ్‌ను అంటున్నారని ఆ 21 మందితోనే మీలో ఉన్న 151మంది అవినీతి అక్రమాలను బయటకు తీస్తామని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌కు పిఠాపురంలో పక్కాగా లక్ష మెజార్టీ వస్తే నెల్లిమర్లలో లోకం మాధవికి 50 వేల ఓట్లు మెజార్టీ వస్తుందని అన్నారు. ఇక్కడ టికెట్‌ ఆశించినా రానప్పటికీ కర్రోతు బంగార్రాజు ఇంతలా సహకరించడం గొప్ప విషయమన్నారు. లోకం మాధవి మాట్లాడుతూ తాను లోకల్‌ కాదు నాన్‌ లోకల్‌ అని అంటున్నారని తాను మాత్రం లోకలేనని అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం రావణ కాష్టమవుతుందన్నారు. జనసేనతో కలిసి పనిచేయాలని అపార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, మాజీ ఎఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ రాజు, మహంతి చిన్నం నాయుడు, మట్టా అయ్యప్ప రెడ్డి, చెల్లుబోయిన నర్సింగరావు, కర్రోతు శ్రీనివాసరావు, మైలపల్లి నరసింహులు, తోగులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️