హుస్సేన్‌ పురంలో జనసేన ప్రచారం

Apr 30,2024 21:56

ప్రజాశక్తి – వీరఘట్టం : మండలంలోని హుస్సేన్‌ పురంలో మంగళవారం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి మీ అమూల్యమైన ఓటు తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైసిపికి చెందిన శ్రేణులు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరారు. వీరికి జయకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, గర్భాన సత్తిబాబు, కె.జగన్నాథం, కె.తాతబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేనలోకి భారీ చేరికలుభామిని : మండలంలోని బాలేరు, భామిని, బొడ్డగూడ, మణిగ పంచాయతీ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన 135 కుటుంబాలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వైసిపి అసమ్మతి నేతలు బొడ్డగూడ సర్పంచ్‌ బిడ్డికి మార్తా, భామిని మాజీ సర్పంచ్‌ పొట్నూరు నాగేశ్వరరావు, భామిని ఎంపిటిసి బిడ్డికి తులసి, నులక జోడు మాజీ సర్పంచ్‌ కోలక అవినాస్‌, నాయకులు బిడ్డికి అనంతరావు, జయరాజు, బిడ్డికి పొట్టేష్‌, కాంతారావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్‌ గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బి. రవినాయుడు, జనసేన నియోజకవర్గం సమన్వయ కర్త నిమ్మక నిబ్రం, టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. జగదీశ్వరావు, జనసేన మండలి అధ్యక్షులు రుంకు, కిరణ్‌, టిడిపి నాయకులు బిడ్డికి ప్రసాద్‌ రావు, సర్పంచ్‌ లోపింటి రాజేష్‌, కొల్ల మధు, బిడ్డికి ప్రభాకర్‌, బిడ్డికి విష్ణు, నిమ్మల మురళి, ఆనందరావు తదితరలు పాల్గొన్నారు.

➡️