రాష్ట్రం వైపు యావ‌త్ దేశం చూపు

Nov 22,2023 16:22 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూల్) : ఇచ్చిన హామీల‌ను 98 శాతం నెర‌వేర్చి యావ‌త్ దేశం చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘ‌నత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జీ జ‌య మ‌నోజ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆదోనిలోని 27వ వార్డులోని ఫ‌రిస్సా మొహ‌ల్లాలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మ‌నోజ్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌ను కొల్లగొట్టి టీడీపీ పార్టీ కార్యకర్తలకు, జన్మభూమి కమిటీల ద్వారా దోచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని ఆరోపించారు. రాష్ట్రం నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఎవరు వేరు చేయలేరని, 2024లో తిరిగి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా ,సన్నీ, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు నర్సింలు, ఎంఎంజి గౌస్, కౌన్సిలర్ ఫయాజ్, బాసు భాయ్, వ‌క్ఫో బోర్డు జిల్లా అధ్యక్షులు నీయాజ్ అహ్మద్, ఖాదర్, వార్డు ఇన్చార్జి హాజీ ఖాదర్, రహీం, బాలాజీ, లాలు, చిరంజీవి, జైపాల్, మమత, స్వామి, సింహం నాగేంద్ర, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, ఆబు బక్కర్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️