జేఎన్టీయు స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదం

Nov 29,2023 11:25 #Anantapuram District
jntu meet governor

తదీలు త్వరలోనే ఖరారు
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జేఎన్టీయు స్నాతకోత్సవ నిర్వహించేoదుకు రాష్ట్రగవర్నర్ మరియు ఛాన్సలర్ అయిన జస్టిస్ యస్.అబ్దుల్ నజీర్ మంగళ వారం రాత్రి ఆమోదం తెలిపినట్లు జేఎన్టీయు ఉపకులపతి ఆచార్య రంగాజనార్దన తెలిపారు. అనంతపురం జేఎన్టీయు ఉపకులపతి ఆచార్య రంగాజనార్దన మరియు రిజిస్టార్ ఆచార్య సి.శశిధర్ రాష్ట్ర గవర్నర్ భవన్ లోరాష్ట్ర గవర్నర్ జస్టిస్ యస్.అబ్దుల్ నజీర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జె.ఎన్.టి.యూ ఉపకులపతి మాట్లాడుతూ గవర్నర్ స్నాతకోత్సవం జరుపుకోవడానికి అంగీకరించారని తెలిపారు. త్వరలోనే స్నాతకోత్సవానికి సంబంధించన తేదీని ఖరారు చేస్తామనిగవర్నర్ తెలిపి నట్లు ఉపకులపతి పేర్కొన్నారు.

➡️