ఐటిఐతో ఉద్యోగావకాశాలు

May 26,2024 21:12

ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ నైపుణ్యాన్ని అందిస్తూ స్వయం ఉపాధి, ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు సాధించడంలో పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ)లు ప్రస్తుతం మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఐటిఐలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటుగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ శిక్షణను ఇస్తున్నాయి. అవసరమైన మెలకువలను విద్యార్థులకు నేర్పిస్తూ ఆ కోర్సులపై పూర్తి పట్టు సాధించేలా చేస్తున్నారు. అందువలన ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో ఐటిఐ విద్యార్థులకు అనేక కంపెనీలలో ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటిఐ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు వత్తి విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఐటిఐలో అనేక కోర్సులు 10వ తరగతి విద్యా అర్హతతో రెండు సంవత్సరాల కోర్సు చేసేందుకు, అదేవిధంగా ఒక సంవత్సరం కోర్సు చేసేందుకు విజయనగరం జిల్లా పరిధిలో మూడు ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ ఐటి ఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటిఐ కళాశాలలు విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లో ఉండగా, జిల్లా కేంద్రంలో 6, కొత్తవలస మండలంలో 5, బొబ్బిలిలో 3, గజపతినగరంలో 2, ఎల్‌.కోటలో 2, ఎస్‌.కోట, రామభద్రపురం, గరివిడి, చీపురుపల్లి, రాజాం, జామి, నరవ గ్రామాల్లో ఒక్కొక్క ఐటిఐ ఉన్నాయి. మూడు ప్రభుత్వ ఐటిఐల్లో వివిధ కోర్సుల్లో 632 సీట్లు ఉండగా, ప్రైవేట్‌ ఐటిఐలలో 4124 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐటిఐ లో రెండేళ్ల కోర్సు వివరాలుపదోతరగతి విద్యార్హతతతో ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానిక్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికల్‌, డ్రాప్ట్స్‌మెన్‌ సివిల్‌, ఎఒ కెమికల్‌, సర్వేయర్‌, పెయింటర్‌ కోర్సులు ఉన్నాయి. అదే విద్య అర్హతతో ఒక్క ఏడాది గల ట్రేడ్లు .. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రాం మింగ్‌ అసిస్టెంట్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, కార్పెంటర్‌, డ్రెస్‌ మేకింగ్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ ఇండిస్టియల్‌ సేఫ్టీ మేనేజ్మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎనిమిదవ తరగతి ఫెయిల్‌ లేదా పాస్‌ విద్య అర్హతతో ఉన్న ఒక సంవత్సరం ట్రేడ్‌ వెల్డర్‌ కోర్సు ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ కళాశాలలో శిక్షణ పొంది అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా పొందుతున్నారు. స్థానిక ఐటిఐ లోనే కొన్నేళ్లుగా ప్రాంగణ ఎంపిక మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో యువత ఐటిఐ వృత్తి కోర్సులు వైపు చూస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి అప్రెంటిస్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. వారికి శిక్షణ కాలంలో పదివేలు స్టైఫండ్‌ రూపేనా అందిస్తున్నారు. ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు చెన్నైలోని టివిఎస్‌ షో రూమ్‌ లోనూ, హైదరాబాదులోని రేడియంట్‌ ఎలక్ట్రానిక్స్‌, క్యూసిఇవి టెక్నాలజీస్‌ ఫర్‌ ఇఒ వెహికల్స్‌, కడపలో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్‌, హైదరాబాదులోని మేదో సెర్వో ఇండియా లిమిటెడ్‌, హెచ్‌ బి ఎల్‌ బ్యాటరీస్‌, డెక్కన్‌ ఫెర్రో, ఎల్‌అండ్‌టి సంస్థ, విజయనగర్‌ బయోటెక్‌, జయభేరి, టాటా మోటార్స్‌, వరుణ్‌ మోటార్స్‌ వంటి సంస్థలతో పాటు మరెన్నో సంస్థల్లో ఉద్యోగ అప్రెంటిస్‌ అవకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, స్టీల్‌ ప్లాంట్‌, నావెల్‌, హిందుస్థాన్‌ ఏరోనాటికల్స్‌, డిఆర్‌డిఒ తదితర సంస్థల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఐటిఐ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ ఇలాఅభ్యర్థులు ఐటిఐ కోర్సుల్లో చేరేందుకు తమ పేర్లను ఱ్‌ఱ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌ సైట్‌లో జూన్‌ 10 రాత్రి 11.59నిమిషాల లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ ఐటిఐలో తప్పనిసరిగా వెరిఫికేషన్‌ చేసుకోవాలి. వెరిఫికేషన్‌ అవ్వని అభ్యర్థులు మెరిట్‌ లిస్ట్‌ జాబితాలో ఉండరు. దీంతో ఇంటర్వ్యూకు అనుమతి ఉండదు. ఐటిఐ విద్యార్థులదే ఉన్నత భవిత ప్రస్తుతం ఐటి సెక్టారు రంగంతో ఏదైనా పోటీ పడుతుందంటే అది ఐటిఐ రంగం ఒక్కటేనని విజయనగరం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్‌, జిల్లా కన్వీనర్‌ టివి గిరి అన్నారు. ఐటిఐలో శిక్షణ పొందిన విద్యార్థులకు వందశాతం ప్లేస్మెంట్‌, అప్రెంటిస్‌ ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థులు ముఖ్యంగా ఆధార్‌ కార్డుకు అనుసంధానమైన మొబైల్‌ నెంబరును మాత్రమే రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇవ్వాలి అన్నారు. కోర్సు పూర్తయినంత వరకు అదే మొబైల్‌ నెంబర్‌ ఉంచుకోవాలని, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, స్త్రీ, పురుష,(జెండర్‌) నాలుగు అంశాలు 10వ తరగతి సర్టిఫికెట్లు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆధార్‌ కార్డులు కూడా ఉండేలాగా చూసుకోవాలని తెలిపారు.

➡️