ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి: జెవివి

ప్రజాశక్తి-పొదిలి: ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిం చేందుకు జెవివి కృషి చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో మూఢనమ్మకాలను విడనాడే విధంగా శాస్త్రీయ అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలో జెవివి ఆధ్వర్యంలో వార్షిక సభలు నిర్వహించాలని, సభ్యత్వ నమోదు పెంచాలని సూచించారు. జూన్‌ 9న చీరాలలో సైద్ధాంతిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అన్నారు. చెకుముకి పత్రిక చందాలను పెంచాలన్నారు. జెవివి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి మాట్లాడుతూ జెవివి లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవత సంస్థ ప్రతినిధి యలమందారెడ్డి, యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ హై, జెవివి జిల్లా కార్యదర్శి బి దేవప్రసాద్‌, కొనకనమిట్ల, పొదిలి మండలాల జెవివి అధ్యక్షులు పివి కొండయ్య, జూపల్లి వెంకటేశ్వర్లు, జెవివి సభ్యులు ఆంజనేయ చౌదరి, బాజీ కరిముల్లా, మూసా జానీ, ఎంవి శ్రీనివాసరావు, కామేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభించారు.

➡️