అవినీతిని అంతమొందించాలి పజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కే శ్రీనివాసులు

ప్రజాశక్తి – బద్వేల్‌ అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం అవినీతి అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా స్థానిక సుందరయ్య భవనంలో ప్రజాసంఘాల సమావేశం నిర్వహించారు. అవినీతి అభివద్ధికి పెనుభూతం లాంటిది పేర్కొన్నారు. అవినీతి లేని దేశాలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందాయని, ప్రస్తుతం దేశంలో అవినీతి పెరిగిపోతుందని చెప్పారు. ప్రజలు అవినీతిలో కూరకు పోయారని, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నిజాయితీగా అంకితభావంతో కషిచేసి దేశ అభివద్ధికి కషి చేయాలని ఆయన అన్నారు. పాలకులు ఓటర్లను అవినీతిపరులుగా తయారుచేసి దేశ అభివద్ధి నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారని చెప్పారు. కొందరు ప్రభుత్వాధికారులు లంచం తీసుకోకుండా పనులు చేయడం లేదని వాపోయారు. కనీసం ప్రాజెక్టు నిర్మాణంలో పేదలకు ఉచిత నిత్యావసర వస్తువుల సరఫరాలోనూ అవినీతి రాజ్యమేలుతుందని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను చేసి అమలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ నాయకులు ఆంజనేయులు, సురేంద్ర, బాల గురయ్యా, సిఐటియు నాయకులు రాజగోపాల్‌, గంప సుబ్బరాయుడు, మహిళా సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అనంతమ్మ, రత్తమ్మ ,పట్టణ నాయకులు కోటపాటి రమాదేవి, మోక్షమ్మ మస్తాన్‌ బి, ,కత్తి నాగమ్మ కత్తి రవణమ్మ పాల్గొన్నారు.అవినీతి అభివద్ధికి నిరోధకం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ సమావేశం సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక ఆధ్వర్యాన జిల్లా ఉపాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులు యోగివేమన విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి అభివద్ధికి పెనుభూతంలాటిది అవినీతి లేని దేశాలే అన్ని రంగాల్లో అభివద్ది చెందాయని, సభాధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ పాలకులు ఓటర్లను అవినీతిపరులుగా తయారుచేసి దేశ అభివద్ది నిరోధకులుగా తయారైనారు. కార్యక్రమంలో ఆవాజ్‌ కమిటీ బద్వేలు పట్టణ అధ్యక్షులు ఎస్‌.ఎ. సత్తార్‌, బి.సి చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బిసి రమణ, సిపిఐసీనియర్‌ నాయకులు వెంకటసుబ్బయ్య, జి.శ్రీనివాసులు కన్జూమర్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ రాష్ట్ర అధ్యక్షులు సి.నారాయణ, అంబేడ్కర్‌ భవన అభివద్ద కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జకరయ్య, కేశవ, యు.మునెయ్య, రిటైర్డ్‌ ఎంఇఒ రామసుబ్బయ్య, డి.వై.యఫ్‌.వై పట్టణ కార్యదర్శి జి.నాగార్జున, జాతీయ బి.సి సంక్షేమ సంఘ జిల్లా వర్కింగ్‌ అధ్యక్షులు యు.రమణ యాదవ్‌, డి.బి.యఫ్‌ రాష్ట్ర నాయకులు చిన్నయ్య, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు శిఖామణి, బిసి సంఘ నాయకులు రంగరాజు, శివరామయ్య, ఆవాజ్‌ కమిటీ సభ్యులు కె.బి రసూల్‌, ఖాజాగౌస్‌, లెక్చరర్లు రవిబాబు,శ్రీనివాసులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌ ఉపాధ్యాయులు మురళీకష్ణ పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న ప్రజా సంఘాల నాయకులు

➡️