ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు కషి : జడ్జి

ప్రజాశక్తి – కడప
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాలులో జిల్లా వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎంVచ్‌ఒ నాగరాజు అధ్యక్షతన పిసి పిఎన్‌డిటిపై సంబంధిత అధికారులతో డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ అడ్వైసరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్సి మాట్లాడుతూ ఆడబిడ్డను రక్షించుకోవాలంటే ఎక్కడా కూడా లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా చేయాలన్నారు. గర్భస్రావాలు జరగకుండా ఆపాలని, అందుకోసం ప్రజల్లో విస్తత ప్రచారం, అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శిలకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలన్నారు. గర్భస్థ శిశు మరణాలను అరికట్టడం ద్వారా లింగ నిష్పత్తిలో అసమానతను తొలగించడంతో పాటు సమాజంలో స్త్రీ నిస్పత్తి పెంపుదల సాధ్యమవుతుందని తెలిపారు. భ్రూణ హత్యల నివారణ కోసం పోలీసు శాఖ వారి సహకారం కూడా తీసుకోవాలన్నారు. కర పత్రాలు, గోడపత్రాల ద్వారా భ్రూణ హత్యలపై వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్‌, విద్యా శాఖలు సంయుక్తంగా విస్తత ప్రచారం నిర్వహించాలన్నారు. డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలల్లో 75 బాల్య వివాహాలు అడ్డుకుని అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేశామన్నారు. చెప్పారు. జిల్లాలోని 145 స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందని, ఇంకా 14 సెంటర్లను ఈ నెలాఖరు లోపు తనిఖీలు చేయడం జరుగుతోందన్నారు. ఎక్కడైనా, ఎవరైనా.. లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు, ఎన్‌జిఒలు ప్రజలు అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లింగ భేదం వెల్లడిస్తే వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు చేస్తామని తెలిపారు. అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌ మాట్లాడుతూ లింగనిర్దారణ పరీక్షలు, భ్రూణహత్యాలు, గర్భస్రావాలు జరగకుండా ఆపాలని, అందుకోసం ప్రజల్లో విస్తత ప్రచారం, అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పిసి పిఎన్‌డిటి సభ్యుల, ఐసిడిఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, దిశ పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఐసిడిఎస్‌ సిబ్బంది, భారత రత్న మహిళా మండలి స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️