నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప
వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి సారించామనితాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. శనివారం విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌ఇజిఎఎస్‌ – కరువు మండలాల్లో వేజ్‌ జనరేషన్‌, వేసవిలో తాగునీటి అవసరాల సన్నద్ధత మొదలైన అంశాలపై. అన్ని జిల్లాల కలెక్టర్‌ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమావేశానికి కడప కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి కలెక్టర్‌తో పాటు, జెసి గణేష్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిని దష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్‌ కాంపోనెంట్‌ పెంపుతో పాటు, కూలీ లకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం కల్పిం చాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఏప్రిల్‌ నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వాసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి కడప పట్టణ నీటి అవసరాలను తీర్చే పెన్నానదిలో సరిపడా నీరు లేకపోవడంతో మైలవరం కుడి కాలువ నుంచి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ద్వారా నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దీంతో పట్టణ తాగునీటి అవసరాలతో పాటు రూరల్‌ ప్రాంతాల్లో కొంతమేర సాగునీటి అవసరాలు కూడా తీరుతాయని తెలిపారు.

➡️