బెల్ట్‌ గ్రేడింగ్‌ టెస్ట్‌లో ‘పవన్‌’ విద్యార్థుల ప్రతిభ

Apr 1,2024 21:03

ప్రజాశక్తి – కడప అర్బన్‌ బెల్ట్‌ గ్రేడింగ్‌ టెస్ట్‌లో పవన్‌ కానెప్ట్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చూపారని కరాటే కోచ్‌ ఎం.విజరు, కోచ్‌ వి.నరేంద్ర పేర్కొన్నారు. 3 గంటలపాటు గ్రీన్‌ బెల్ట్‌ శిక్షణ ఇచ్చారు. ప్లైన్‌ ఆరెంజ్‌ బెల్డ్‌ ప్రమోషన్‌లో ఎస్‌.సఫాన్‌, పి.జయకార్తీక్‌ రెడ్డి, ఎం.నయనిక, పి.వర్షిత, ఫాతిమ, ఉమె మనహ, యశ్వంత్‌కుమార్‌, రైహాన్‌ బేగ్‌, అఫ్పాన్‌, రేవంత్‌ కుమార్‌ స్వామి, దుర్గా హర్షవర్థన్‌, రాఘవ మహిధర్‌, బి.సంతోష్‌, ఎస్‌.ఎం.డి.కైష్‌, ఎం.నంద మురళి ఉత్తీర్ణత అయ్యారని పేర్కొన్నారు. గ్రీన్‌ బెల్డ్‌-2 ప్రమోషన్‌లో కె.రాజ్యలక్ష్మి, బి.మురసిర్‌, వై.సులైమాన్‌, బి.మహిదర్‌, పి.ఖిజర్‌, ఎం.చైతన్య కుమార్‌, జి.కులాయబాష, జి.రోహన్‌, వి.విగేష్‌ ప్రమోట్‌ అయ్యారని తెలిపారు. పవన్‌ స్కూల్‌ అధినేత లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ 8 నెలలు కోచింగ్‌ తీసుకుని వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని గోల్డ్‌, సిల్వర్‌,బ్రాంచ్‌ మెడల్‌ సాధించి అటు స్కూల్‌కు, ఇటు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులను అభినందించారు. కరాటే వికృత క్రీడ కాదని పేర్కొన్నారు. ఇది ఆత్మరక్షణకు ఎంతోగానో ఉపయోగ పడే ఒక మంచి ఆయుధమని తెలిపారు. విద్యార్థులను అభినందించారు.

➡️