మాధవరంలో విషాదం

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
రైలు కింద పడి భర్త..ఉరేసుకుని భార్య, కుమార్తె..
రెవెన్యూ అధికారులు మోసం చేశారని బలవన్మరణం
ప్రజాశక్తి-ఒంటిమిట్ట
కొత్తమాధవరానికి చెందిన పాలసుబ్బారావు (47) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఒంటిమిట్ట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 2185/2లో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమిని అమ్ముదామని ప్రయ త్నించగా రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో రికార్డులు తారు మారు చేశారు. కట్టా శ్రావణి అనేపేరుపై ఆన్‌లైన్‌లో ఎక్కిం చడంతో మనస్థాపం చెందిన సుబ్బారావు, అతని భార్య పద్మా వతి(41), కుమార్తె వినయ (17) ఆత్మ హత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం తల్లీకూతుళ్లు ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందారు. పాల మనిషి వచ్చి తలుపు తట్టగా ఎవరూ తీయక పోవడంతో అతను స్థానికులకు తెలియజేశాడు. వారు తలుపు తీసు చూడగా తల్లీకూతుళ్లు విగత జీవు లుగా పడి ఉండడం చూసి వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. సుబ్బా రావు మాత్రం ఒంటిమిట్ట చెరువు దగ్గర ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సిఐ పురు షోత్తమరాజు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ట్రాక్‌పై సుసైడ్‌ నోట్‌ లభించింది. కడప డిఎస్‌పి షరీఫ్‌ కొత్త మాధవరంలోని మృతుల ఇంటిని పరిశీలి ంచారు. ఆత్మ హత్యలపై స్థానికులతో ఆరా తీశారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆన్‌లైన్‌లో భూ కబ్జా.. పాల సుబ్బరావు చేనేత కార్మికుడిగా మగ్గం పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమార్తెలను పోషిం చుకుంటున్నాడు. ఒక కుమార్తె హైదరాబాద్‌లో చదువుకుం టుంది. అతనికి మూడెకరాలు భూమి ఉంది. 2015లో తన పేరుపై ఆన్‌లైన్‌ చేశాడు. రైతు భరోసా కింద డబ్బులు పడు తూ ఉండేది. రెండేళ్ల కిందట ఇంటి అవసరాల కోసం తన భూమిని అమ్ము దామని ప్రయ త్నించగా ఆన్‌లైన్‌ లో తన పేరుమీదగాక కట్టా శ్రావణిపై ఉంది. ఈ విషయంపై అతను రోజూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేవాడు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, పేద కుటుంబం కావడంతో ఇద్దరి కుమార్తెలను ఎలా పోషించుకోవాలో అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు పేర్కొం టున్నారు. రెవెన్యూ అధికారుల మోసానికి నిండు కుటుంబం బలైందని వాపోతున్నారు.సూసైడ్‌ నోట్‌లో.. మూడెకరాల పొలాన్ని అమ్ముకోవాలని అనుకోగా రెవెన్యూ అధికారులు తమ పొలాన్ని వేరే వారి పేర్లపై మార్చి మోసం చేశారని, ఏమీ చేయలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు నోట్‌లో రాసింది ఉంది. డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలన.. డిఎస్‌పి ఆధ్వర్యంలో డాగ్‌ స్క్వాడ్‌ మృతులు ఇంటి చుట్టూ పరిశీలించారు. జాగిలం ఇంటి వెనుకభాగం వరకు వెళ్లి ఆగింది. తరువాత తిరిగి ఇంటి వద్దకు వచ్చింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాల్సి ఉంది. డిఎస్‌పి ఏమన్నారంటే.. రెవెన్యూ అధికారులు పాలసుబ్బారావు భూమిని ఆన్‌లైన్‌లో తారుమారు చేయడంతో మృతిచెందినంట్లు సుసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. సుసైడ్‌ ఆధారంగా విచారణ కొనసాగిస్తుమని కడప డిఎస్‌పి షరీఫ్‌ పేర్కొన్నారు. అధికారుల ఆగడాలకు హద్దే లేదు.. రెవెన్యూ అధికారుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వారి అండదండలతో కబ్జాదారులు భూములను ఆక్రమిస్తున్నారు. వారి ధనదాహానికి ఓ నిండు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.-పన్నెల చంద్ర శేఖర్‌, గ్రామ సర్పంచ్‌. కఠినంగా శిక్షించాలి రెవెన్యూ అధికారుల మోసం వల్ల నా కుమార్తె, అల్లుడు, మనమరాలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. నా ఇంకో మనమరాలిని ప్రభుత్వం ఆదుకోవాలి. – వెంకటసుబ్బమ్మ, మృతురాలి పాలపద్మ తల్లి.

➡️