మా వేతనాలు పెంచండి

Jan 1,2024 15:06 #Rayalaseema
anganwadi workers strike 21 day rayalaseema
  • మున్సిపల్ కార్మికులు కేక్ కట్ చేసి వినూత్న నిరసన 

ప్రజాశక్తి-కడప : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్ , సెమి స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెబుతూ, ప్రగల్బాలు పలుకుతూ కార్మికులందరి సమస్యలను పట్టించుకోవడంలేదని నూతన సంవత్సరంలోనైనా సమ్మెను విరమించేలా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య నాయకులు రామకృష్ణ కరిముల్లాలు కేక్ కట్ చేయగా కార్యదర్శి భాస్కరాచారి నాయకులు రామకృష్ణ,, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్దయ్యలతోపాటు మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కే. మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమి స్కిల్డ్, వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని కార్మికులంతా మరింత ఐకమత్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️