మిస్టర్‌ ఆంధ్రగా భాస్కర్‌ రావు

ప్రజాశక్తి – కడప
కడప నగరంలోని యూఎస్‌ మహల్‌ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రాష్ర ్టస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీ లలో విశాఖపట్నానికి చెంది న భాస్కర్‌రావు ఛాంపి యన్స్‌గా నిలిచి మిస్టర్‌ ఆంధ్ర టైటిల్‌ను కైవసం చేసు కున్నారు. రన్నర్స్‌గా విజయ నగరానికి చెందిన కిషోర్‌ నిలిచాడు. బెస్ట్‌ ఫోజర్‌గా కడపకు చెందిన మెహరాజ్‌ నిలవడం విశేషం. ఈ పోటీలలో రాష్ట్రానికి చెందిన వివిధ జిల్లాలకు సంబంధించి 300 మంది పాల్గొన్న ఈ పోటీలలో 15 కేటగిరీలకు చెందిన విభాగాలలో పోటీలు నిర్వహించారు. మిస్టర్‌ ఆంధ్ర, రన్నర్‌ ఆఫ్‌, బెస్ట్‌ పోసర్‌ గా నిలిచిన వారికి అధిక మొత్తంలో నగదుఅవార్డులను అందజేశారు. బాడీ బిల్డింగ్‌ పోటీల నేపథ్యంలో సినీ నటులు రామ్‌ జగన్‌, గీతా సింగ్‌, జబర్దస్త్‌ శాంతి కుమార్‌, జంగిల్‌ జగన్‌, హరికష్ణ, కార్తీక్‌ ప్రసాద్‌ కామెడీ షోలు, డాన్స్‌ షో లతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కార్పొరేటర్‌ షఫీ, వైసిపి యువజన విభాగం అధ్యక్షులు దేవి రెడ్డి ఆదిత్య, నాయ కులు అమ ర్నాథ్‌, జన వికాస్‌ తాహీర్‌, బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అధ ్యక్ష కార్యదర్శులు నూనె నగేష్‌, షేక్‌ యునుస్‌ భాష, చైర్మన్‌ యు. వై. కుమార్‌, కోశాధికారికి రమేష్‌, మహిళా అధ్యక్షురాలు సీమా, అసోసియేట్‌ అధ్యక్షులు శివప్రసాద్‌, ఐ బి ఎఫ్‌ రెఫరీలు సత్య, సోని, బాడీ బిల్డర్లు పాల్గొన్నారు.

➡️