మెరుగైన విధుల నిర్వహణకే శిక్షణ

ప్రజాశక్తి-కడప అర్బన్‌
రాబోవు ఎన్నికల్లో సిబ్బంది మెరుగైన విధులు నిర్వహించేందుకే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఎఆర్‌ ఎఎస్‌పి కృష్ణారావు పేర్కొన్నారు. ఎస్‌.పి సిద్దార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు ఇటీవల ప్రారంభమైన యాంటీ-రయట్‌ డ్రిల్‌ శిక్షణ ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం సివిల్‌, స్పెషల్‌ పార్టీ పోలీస్‌ సిబ్బంది నూతనోత్సాహంతో శిక్షణలో పాల్గొన్నారు. ఎఎస్‌పి శిక్షణను పరిశీలించి సిబ్బంది స్పందనను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో భాగంగా గ్యాస్‌ గన్‌తో గ్యాస్‌ షెల్‌ వినియోగంచే విధానం, వజ్ర వాహన వినియోగం, లాఠీ డ్రిల్‌ తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. కార్యక్రమంలో ఎఆఱ్‌ డిఎస్‌పి మురళీధర్‌, ఆర్‌ఐలు ఆనంద్‌, వీరేష్‌, శివరాముడు, ఆర్‌ఎస్‌ఐలు, ఎఆర్‌, సివిల్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

➡️