శ్రీసీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

ప్రజాశక్తి-ఒంటిమిట్ట
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుంచి 25 వరకు బ్రహ్మో త్సవాలు, 22న కల్యాణం అత్యంత వైభంగా నిర్వహి ంచనున్నామని టిటటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొ న్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ విజయ రామరాజు, ఎస్‌పి సిద్ధార్థ్‌కౌశల్‌, జిల్లా యంత్రా ంగంతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఇఒ మాట్లాడుతూ టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికా రులను కోరారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహి ంచాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్‌ 16న అంకురార్పణ, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 20న హనుమంత వాహనం, 21న గరుడవాహనం, 22న సీతా రాముల కల్యా ణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహి ంచనున్నట్లు తెలిపారు. 23న రథోత్సవం, ఏప్రిల్‌ 25న చక్రస్నానం, 26న పుష్పయాగం నిర్వహి స్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి, జిల్లా యంత్రాంగం విస్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్‌, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్‌టిసిబస్సులు, సైన్‌ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం తదితర విభాగాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఎస్‌పి మాట్లా డుతూ టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో సిసి కెమరాలు, కంట్రోల్‌ రూం ఏర్పాటు తదితర అం శాలపై అధికారులకు సూచనలు చేశారు. సమా వేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, కడప మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, నరసింహ కిషోర్‌, ఎస్‌వి బిసి సిఇఒ శ్రీ షణ్ముఖ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, వివిధ శాఖల జిల్లా, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

➡️