సదస్సులు పరిశోధనలకు ఉపయోగకరం

ప్రజాశక్తి – కడప
అంతర్జాతీయ సదస్సులను నిర్వహించటం వల్ల ప్రపంచంలోనే ప్రసిద్ధ పరిశోధనల గురించి తెలు సుకోవటానికి అధ్యాపకు లకు, విద్యార్థులకు ఎంత గానో దోహద పడుతుందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌, కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ వై. సావిత్రి అన్నారు. ప్రభుత్వ పురుషుల కళాశాలలో జంతు శాస్త్ర శాఖ, గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘ఆన్‌ సోషియో ఎకనామిక్‌ రిలయన్స్‌ ఇన్‌ సైన్స్‌ సోషల్‌ సైన్స్‌ అండ్‌ కామర్స్‌ టువర్డ్స్‌ సస్టైనబులిటీ’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభంలో ప్రధాన ఆచార్యులు డాక్టర్‌ జి రవీంద్రనాథ్‌, కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ వై. సావిత్రి మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో సుస్థిర అభివద్ధిని సాధించడానికి సామాజిక ఆర్థిక అంశాలు ఏ విధంగా ఉప యోగపడతాయి అనే అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవచ్చని తెలి యజేశారు. సెమినార్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ పి. రవి శేఖర్‌ మాట్లాడుతూ 2047 సంవత్సరానికి భారతదేశం అభివద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండటానికి అధ్యా పకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తల ప్రాముఖ్యతను తెలుసు కోవటానికి ఇటువంటి కార్యశాలలు ఎంతగానో ఉపయో గపడతాయని తెలియజేశారు. మొదటి కీనోట్‌ స్పీకర్‌గా శాలిస్బరీ యూనివర్సిటీ అమెరికా నుండి ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ సప్తర్షి సుస్థిర అభివద్ధిలో ఆర్థిక అంశాల యొక్క ప్రాము ఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సౌత్‌ కొరియాకు చెందిన గుడాకే, ప్రొఫెసర్‌ అద్విటోట్‌ శివరాయ, సంతోష్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌, ఐక్యు ఎసి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి. రామచంద్ర, వివిధ టెక్నికల్‌ సెషన్స్‌కి చైర్‌ పర్స న్స్‌గా డాక్టర్‌ డి. వి. నాగేంద్ర కుమార్‌, శశి దేవి, మహేష్‌, అరుణకుమారి, నీత, రంజిని పాల్గొన్నారు.

➡️