హామీలు నిలబెట్టుకోవాలని వినతిపత్రం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విద్యుత్‌ స్ట్రగుల్డ్‌ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో జెసికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. నేరుగా వేతనాలు చెల్లించాలని, వేతనాలలో వ్యత్యాసాన్ని నివారించాలని, వన్‌ ఇండిస్టీ వన్‌ సర్వీస్‌, రెగ్యులేషన్‌ ఇంప్లిమెంట్‌ చేసి ఎనర్జీ అసిస్టెంట్లు జెఎల్‌ఎం గ్రేడ్‌ 2 ఉద్యోగులకులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంలో జరుగుతున్న పరిమాణాలు విద్యుత్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను, అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఒకే సంస్థలో రెండు రకమైన సర్వీస్‌ రెగ్యులేషన్స్‌ తీసుకురావడం, విద్యుత్‌ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించే అంశం విద్యుత్‌ ఉద్యోగులు గమనించాలని చెప్పారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో సర్కిల్‌ ఆఫీసుల వద్ద 8న ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 12 నుంచి విజయవాడలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. స్ట్రగుల్‌ కమిటీ చేస్తున్న ఉద్యమాలకు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, స్ట్రగుల్‌ కమిటీ నాయకులు శివశంకర్‌, నాగసుబ్బయ్య, నాయబ్‌ రసూల్‌, ఎరుకల రెడ్డి, గంగయ్య, డి.పుల్లారెడ్డి పవన్‌ కుమార్‌, సురేంద్రబాబు, నూర్‌ బాషా,గోపి, శివ పాల్గొన్నారు. వినతి పత్రాన్ని ప్రదర్శిస్తున్న నాయకులు

➡️