సమస్యల వలయంలో మినీ గురుకులం

బడి వైపు కన్నెత్తి చూడని ప్రాజెక్టు ఆఫీసర్‌
రెగ్యులర్‌ హెచ్‌ఎం లేక అవస్థలు
సిలబస్‌ పూర్తి చేయడంలోనూ నిర్లక్ష్యం
నర్స్‌ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రజాశక్తి-రైల్వేకోడూరు
తమ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తారని కొండంత ఆశతో విద్యార్థులను గురుకులానికి పంపుతున్న గిరిజన తల్లితండ్రులకు నేడు నిరాశే మిగులుతుంది. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసి నడుపు తున్న మినీ గురుకులం నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీలోని మినీ గురుకుల గిరిజన బాలికల పాఠశాలలో సుమారు 180 మందికిపైగా విద్యార్థులు హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి చిట్వేలు, పుల్లంపేట మండలాల్లో గిరిజనులు (యానాదులు) 30 వేలకుపైగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన వసతితో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో గతంలో ప్రభుత్వం మినీ గురుకులం ఏర్పాటు చేసింది. పాఠశాలలో చేరే బాలికల సంఖ్య క్రమంగా ప్రతి ఏటా పెరుగుతుంది. 2011 నుంచి పాఠశాలను ప్రారం భించారు. గురుకులంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వంట మనిషి, నర్స్‌, అరకొర విద్యా బోధన, శాశ్వత ప్రధానోపాధ్యాయులు వంటి సమస్యలు ఉన్నారు. గురుకులానికి చాలా కాలంగా పర్మినెంట్‌ హెచ్‌ఎం లేక ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జితోనే కొనసాగడంతో అజమాయిషీ కరువై ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల్లో భాధ్యత కొరవడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగవ తరగతి ఉద్యోగులైన వంట మనిషులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో ఎవరు కూడా విధుల్లో చేరిన పది రోజులు కూడా ఉండటం లేదు. వంట చేసే సందర్భంలో విద్యార్థులే వంట మనిషి పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులు వంట సహాయకులుగా ఉంటుం డటంతో వారి విద్య కుంటుపడుతోంది. కొందరు ఉపాధ్యాయుల వల్ల బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులను కులం పేరుతో దూషిం చడం, అసభ్యంగా మాట్లాడటం, సక్రమంగా పాఠాలు బోధించడంలో కొందరు ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్యం దోరణి ఎక్కువగా ఉంటోంది. ఉపాధ్యాయులు తమ పిల్లలను స్కూలుకు తీసుకురావడంతో సిలబస్‌పై దృష్టి సారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బోధించడానికి ఇబ్బందిగా మారి వారి పిల్లలను ఆలన పాలనలో ఎక్కువ సమయం గడుపుతూ సిలబస్‌ బోధించే విషయం పూర్తిగా విఫలమైందనే విమర్శి ఉంది. గత ఏడాదిలో పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చేరే బాలికలు ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. సోషియల్‌, హిందీ, మ్యాథమెటిక్స్‌ పూర్తిస్థాయిలో బోధించకుండా ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినమని చెప్పడంతో విద్యార్థులు విసుగెత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో మార్కులు చాలా తక్కువ రావడంతో ఎంపిసి, బైపిసి సబ్జెక్టులు తీసుకునే పరిస్థితి లేదు. ఆర్ట్స్‌ గ్రూప్‌ తీసుకొని మేము ఇంటర్‌లో చేరు తున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దష్టి పెట్టాలని ఇప్పుడు చదువుతున్న బాలికలకు సరైన చదువు చెప్పాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇన్ని సమస్యలు ఇక్కడ తిష్ట వేసినా నెల్లూరులో ఉంటున్న ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం బాధా కరం. మినీ గురుకుల గిరిజన బాలికల సమస్యలపై ఎప్పుడు పరిష్కారం చేయా లనే ఆలోచన చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజె క్టు అధికారికి చీమ గుట్టినట్లు లేకపోవడం చాలా దారుణమని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్స్‌ లేకపోవడంతో విద్యా ర్థులు అనా రోగ్యం బారిన పడినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత విద్యా సంవ త్సరం నుండి పైసమస్యలు గురుకులంలో తిష్ట వేసినప్పటికీ విద్యా ర్థులు సర్దు బాటు చేసుకుని విద్యాభ్యాసం కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దష్టి సారించి బాలికల తలితండ్రులు కోరుతున్నారు.సమస్యలను పరిష్కరిస్తాం నాలుగో తరగతి ఉద్యోగులు సమస్య ఉంది. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా ఉండేందుకు పరిష్కారం కోసం కషి చేస్తా. పాఠశాలలో ఉపాధ్యాయులు సిల బస్‌ను పూర్తి చేసి విధంగా చర్య తీసుకుంటా. బాలికలకు మంచి విద్య అందించడానికి నా వంతు నేను కషి చేస్తా.- బి.లతలి, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం, మినీ గురుకుల గిరిజన బాలికల పాఠశాల, రైల్వేకోడూరు.సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే శాశ్వత ప్రాతిపదికగా పరిష్కరించాలి. అక్కడ ఖాళీగా ఉన్న పోస్ట్‌లు వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు పనిభారం లేకుండా, భద్రత కల్పించాలి. పోషకాహారం అందివ్వడంతో పాటు ఉపాధ్యాయుల ఇష్టారాజ్యానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. లేకపోతే విద్యార్థుల తల్లితండ్రులతో కలిసి ఆందోళనలు చేపడతాం.- జలకం శివయ్య, జిల్లా అధ్యక్షులు, యానాదులు (గిరిజన) సంక్షేమ సంఘం, అన్నమయ్య జిల్లా.

➡️