నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లుసంసిద్ధం చేయాలి

వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు
ప్రజాశక్తి – కడప
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామి నేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు అన్ని నియో జకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌ లోని బోర్డు మీటింగ్‌ హాలులో కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అన్ని విభాగాల నోడల్‌ అధికా రులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఇఆర్‌ఒలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న సార్వ త్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుండి అభ్యర్థుల నామినేషన్‌ దాఖల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని నియో జకవర్గాల ఆర్‌ఒలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియకు సంబందించిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం నమోదు చేసుకున్న వారందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నిరకాల ఏర్పాట్లను సంబంధిత ఏఆర్వోల ద్వారా సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని నియోజకవర్గాలకు నిర్దేశించిన కౌంట్‌ మేరా ఇవిఎం, వివి ప్యాడ్‌, సామగ్రిని భద్రంగా చేర్చాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద టాయిలెట్లు, తాగునీరు, షామియానాలు, పార్కింగ్‌ ప్లేస్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, సూచిక బోర్డులను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి విభిన్న ప్రతిభావుంతులకు, సీనియర్‌ సిటీజన్లు, ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్దేశించిన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచడంపై ఆర్‌ఒలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ముందురోజే గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్‌ దాఖలకు సంభందించిన గైడ్‌ లైన్స్‌ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా నియోజక వర్గాల నుంచి తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు,ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

➡️