అనాధ ఆశ్రమంలో సిఎం జగన్ జన్మదిన వేడుకలు

Dec 21,2023 11:42 #Kadapa
cm jagan birth day celebrations kadapa

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు సందర్భంగా రంగసముద్రం పంచాయతీలోని బ్లెస్స్డ్ బ్రయాన్ అనాధాశ్రమంలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్ పర్సన్ చిత్త విజయ్ ప్రతాపరెడ్డి, బద్వేల్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు చిత్త గిరి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని ప్రజలందరి ఆశీస్సులు వారికి ఎల్లప్పటికీ ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్ ఎంపీటీసీ మహబూబ్ పిరా, బాలుడు, చిన్నరాయుడు, కొండయ్య, భాష తదితరులు పాల్గొన్నారు.

➡️