కాంగ్రెస్‌ విజయం తథ్యం

తులసి రెడ్డి
ప్రజాశక్తి- పోరుమామిళ్ల
తల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు రోజురోజుకూ ఆదరించడం ఎక్కువైతుందని ఆ నమ్మ కంతోనే బద్వేల్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ జ్యోతి గెలుపు ఖాయం అని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని అన్వర్‌ హాస్పిటల్‌ ఆవరణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందుబాటు ఉండే 9 పథకాలు తీసుకొస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, మహిళలకు వంట గ్యాస్‌ రూ. 500 లకే సరఫరా చేస్తారని చెప్పారు. రూ. ఐదు లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. యువతి యువకులకు లక్షల 50 వేలఉద్యోగాలు, ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరికి రూ. 4 వేల పింఛన్‌ అందిస్తామని వివరించారు. వికలాంగులకు ఇంటివద్దే పింఛన్‌ పంపిణీ చేస్తామని, కుటుంబానికి ఆసరాగా ప్రతి మహిళకు రూ. 8500 ఇస్తామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఐదు పథకాలు, ఆరు పథకాలతో తెలంగాణలో, ఎపిలో 9 పథకాలతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అనంతరం అభ్యర్థి విజయ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో, కాంగ్రెస్‌ పార్టీ అవసరం చాలా ఉందని, బద్వేల్‌ నియోజకవర్గంలో తనకు, కడప ఎంపీ స్థానానికి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు అన్వర్‌, సిపిఎం నాయకులు భైరవప్రసాద్‌, సిపిఐ నాయకులు, పిడుగు మస్తాన్‌, రవికుమార్‌, కేశవ వీరయ్య, కాంగ్రెస్‌ నాయకులు శామీర్‌ శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️