రేషన్‌ బియ్యంలో కోత

ప్రజాశక్తి-బి. కోడూరు
పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యంలో కోత విధిస్తున్నారు. ఈనెలలో కిలో తగ్గించి ఇవ్వడంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యంలో కోత విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని పది పంచాయతీలకు సుమారు వెయ్యి రేషన్‌ కార్డులున్నాయి. ప్రతి కార్డుదారుడికీ కిలో బియ్యం కోత విధించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌ సరఫరా ఆపరేటర్లను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచుతున్నామని సమా ధానమిస్తున్నారు. వెయ్యి కార్డులకు, సుమారు వెయ్యి కిలోల బియ్యం కోత విధించారు. పైగా కిలో బియ్యం కోత పెట్టడంతోపాటు , రాగిపిండికి డబ్బులు తీసుకుంటున్నారని కార్డుదారులు వాపో తున్నారు. ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదని పేర్కొన్నాపరు. ప్యాకింగ్‌ ఖర్చుల కోసం పేదలకు సరఫరా చేసే బియ్యంలో కోతవిధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహ శీల్దార్‌ స్పందిస్తూ ఈనెలలోనే ఇలా పంపిణీ చేయాలని ఆదేశాలు న్నాయని పేర్కొన్నారు. ఇచ్చే అరకొర రేషన్‌లోనూ కోత విధిస్తే తాము ఎట్టా బతికేదని పేదలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధి కారులు రేషన్‌ బియ్యంలో కోత విధించకుండా సక్రమంగా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

➡️