అంగన్వాడీల కార్మికుల సమ్మెకు పుట్టా సుధాకర్ మద్దతు

Dec 16,2023 16:58 #Kadapa
kadapai anganwadi strike 5th day

అంగన్వాడి కార్మికుల నిరసనకు చిన్నారుల మద్దతు

ప్రజాశక్తి – బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా అంగన్వాడి కార్మికుల సమ్మెకు మైదుకూరు టిడిపి ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, చిన్నారులు మద్దతు తెలిపారు. అనంతరం సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓ నియంత పాలనగా ఉందని మైదుకూరు తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐదవ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు సునీల్, రాహుల్, దేవ టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను పల్లి సుబ్బారెడ్డి, పూజ శివయ్య, సుధాకర్, జయరామిరెడ్డి, మండల యువ నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️