ఆర్‌సిఎం ఎయిడెడ్‌ పోస్టుల అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి

Jun 17,2024 20:55

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీలో రూ .4 కోట్ల కుంభకోణం
మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక వినోద్‌కుమార్‌
ప్రజాశక్తి- కడప అర్బన్‌
ఆర్‌సిఎం ఎయిడెడ్‌ పాఠశాలలలో 25 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పోస్టింగ్స్‌ ఇవ్వకుండా బిషప్‌ గాలి బాలిరెడ్డి అన్యాయం చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక వినోద్‌ కుమార్‌ విమర్శించారు. కడప మరియాపురం చర్చి దగ్గర నుంచి బిషప్‌ హౌస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బిషప్‌ హౌస్‌ వద్ద నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎయిడెడ్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కడప డయాసిస్‌ ఆర్‌సిఎంలో దాదాపు 20 సంవత్సరాల తరువాత ఎయిడెడ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని చెప్పారు. అర్‌సిఎం డయాసిస్‌లోని పాఠశాలలకు దాదాపు 29 ఉద్యోగాలకు అనుమతి వచ్చిందన్నారు. అందులో ఎస్‌జి టి15, బిఈడి -14 మొత్తం-29. అన్‌ ఎయిడెడ్‌ ఉbా్యయులైన తాము సుమారుగా 23 సంవత్సరాల నుంచి కేవలం రూ.600 నుంచి రూ.4 వేలు చాలీ చాలని జీతంతో మన ఆర్‌సిఎం సంస్థలో ఎప్పటికైనా ఎయిడెడ్‌ పోస్ట్‌ వస్తుందనే నమ్మకంతో గంపెడు ఆశతో, అంగవైకల్యాన్ని లెక్క చేయక ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి, తమజీవితాల కోసం పనిచేస్తూ వచ్చారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది అంటే తమ అదష్టంగా భావించామని తెలిపారు. ఇన్ని ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించామని పేర్కొన్నారు. అయితే బిషప్‌ వారి ఆశలు నిరాశలుగా మార్చాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్‌సిఎం సంస్థలలో పనిచేయని, రోస్టర్‌ పాయింట్స్‌లో లేని కొత్త వ్యక్తుల నుంచి ఒక్కొక్క పోస్ట్‌ కు రూ 30 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు మాకు రావలసిన ఉద్యోగాలను ఇప్పటికే 12 ఉద్యోగాలను అమ్ముతున్నట్లు ఆరోపించారు. మరికొన్ని ఉద్యోగాలను కమిటీలో ఉన్న ఫాదర్స్‌ కుటుంబీకులకు, బంధువులకు బిషప్‌ గాలి బాలిరెడ్డి, రెండవ బిషప్‌ డ్రైవర్‌ జార్జ్‌ సిఫార్సు తో కొన్ని ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చేశారని తెలిపారు. ఈ నేపధ్యంలో బాధిత ఉపాధ్యాయులకు చాలా ఆందోలనలకు, మానసిక క్షోభకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లితే బిషప్‌ బాధ్యత వహించాలని చెప్పారు. కార్యక్రమంలో బాధిత ఉపాధ్యాయులు కవిత, ప్రమీలారాణి, వెంకటసుబ్బయ్య,శేఖర్‌, ప్రమీల,ఎల్లయ్య పాల్గొన్నారు.బిషప్‌ తో మాట్లాడేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, మాల మహానాడు నాయకులు

➡️