అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు : ఎంఎల్ఏ

Jan 6,2024 11:20 #Kadapa
mla on pensions

ప్రజాశక్తి – చాపాడు : చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో శనివారం పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎస్ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 3వేలు పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలుపరచడం ముఖ్యమంత్రి జగన్ కే సాధ్యపడిందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు తిరుపాల్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారులు ఓబుల కొండారెడ్డి, ఎంపిపి టి లక్ష్ముమయ్య , జడ్పిటిసి భర్త శాంతరాజు, వైసీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, గృహ సారధుల మండల కన్వీనర్ అన్నవరం రామ్మోహన్ రెడ్డి, కాత్యాయని కన్స్ట్రక్షన్ ఎండి పివి రమణారెడ్డి ఎంపీటీసీలు ఎస్సార్ బాల నరసింహారెడ్డి సుబ్బరామిరెడ్డి, సర్పంచ్ శివప్రసాద్ ,ఉపసర్పంచ్ ఓబులేసు, ఎంపిడిఓ శ్రీధర్ నాయుడు, ఏఓ మ్యాగీ, ఈఓపీఆర్డీ రాధాకృష్ణ వేణి, మండల స్థాయి అధికారులు మండల నాయకులు నారాయణ రెడ్డి, జయరామిరెడ్డి , జయసుబ్బారెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ నిరంజన్ రెడ్డి, అశోక్, నాగేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.

➡️